Kerala: బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. వీడియో తీసిన యువతి.. తట్టుకోలేక ఆత్మహత్య(వీడియో)
- బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ యువతి వీడియో
- యువతి నిందారోపణ తట్టుకోలేక బాధితుడు ఆత్మహత్య
- ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ యువతి వీడియో తీసింది. యువతి నిందారోపణ తట్టుకోలేక బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ యువతి.. వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో తాను అలాంటి స్వభావం గల వాడిని కాదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీపక్. మృతుడిని కోజికోడ్‌లోని గోవిందపురంలో నివసిస్తున్న పుతియారాకు చెందిన దీపక్ యుగా గుర్తించారు.
Also Read:Janasena: వీడియో వైరల్.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు..
Also Read
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
- Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
పోలీసుల ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో, దీపక్‌ను నిద్రలేపడానికి అతని తల్లిదండ్రులు పడకగది తలుపు తట్టారు, కానీ పదేపదే ప్రయత్నించినా ఎలాంటి స్పందన రాలేదు. తరువాత వారు పొరుగువారి సహాయంతో గదిలోకి ప్రవేశించి చూడగా, అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఇంటికి చేరుకుని మరణాన్ని ధృవీకరించారు. దీపక్ ఒక టెక్స్టైల్ సంస్థలో పనిచేస్తున్నాడని, తన పని నిమిత్తం శుక్రవారం కన్నూర్‌కు వెళ్లాడని బంధువులు తెలిపారు.
Also Read:Pooja Hegde : నా క్యారవాన్ లోకి అనుమతి లేకుండా వచ్చిన పాన్ ఇండియా హీరోను చెంపదెబ్బ కొట్టాను
అదే రోజు, దీపక్ కూర్చున్న బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు, అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియోను రికార్డ్ చేసిందని ఒక బంధువు విలేకరులకు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైందని, అది దీపక్ దృష్టికి కూడా వచ్చిందని పోలీసులు చెప్పారు. బంధువుల ప్రకారం, దీపక్ ఆ ఆరోపణను ఖండించాడు. వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుండి తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. మెడికల్ కాలేజ్ పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు తేలిందని, వీడియో ప్రచారానికి దారితీసిన పరిస్థితులను కూడా దర్యాప్తులో పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.
A 42-year-old man, against whom a video alleging misbehaviour with a woman passenger on a bus had surfaced on social media, was found hanging dead at his residence on Sunday, police said.
The deceased was identified as Deepak U, a native of #Puthiyara, who was residing at… https://t.co/1yky0cy4ar pic.twitter.com/d4y5dTSO6E
— Hate Detector 🔍 (@HateDetectors) January 18, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!