అదో ఆర్టీసీ బస్సు.. కానీ ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉన్నాయి. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించే వరకు బయటికి రాలేదు. తెలంగాణ ఆర్టీసీలో ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. గరుడప్లస్, సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, ఈ మూడు బస్సులకు ఒకే నెంబర్ ఉంది. ఆ మూడు బస్సులపై ఫైన్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ వన్ డిపోలో టీఎస్ 08 z 0208 ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్ సర్వీసుగా నడుస్తుంది.…
రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా యూపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని UPSRTC పేర్కొంది. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని…
అక్కడికక్కడే 18 మంది మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో లక్నో – అయోధ్య హైవేపై మంగళవారం అర్ధరాత్రి డబుల్ డెక్కర్, బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో.. స్పాట్‌లోనే 18 మంది మృతిచెందగా.. మరో 15 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.. పంజాబ్‌లోని లూధియానా నుంచి ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీహార్ వెళ్తుంది.. అయితే.. బారాబంకి రామ్‌స్నెహిఘాట్ కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారిపై బస్సు నిలపివేశారు..…
మెక్సికో దేశంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈశాన్య మెక్సికోలోని తమౌలీపాస్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం జరిగింది. రేనోసా-న్యూవోలియోన్ మోంటెర్రే మధ్య బస్సు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వేగంగా ప్రయాణం చేస్తుండటంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించగా…
తెలంగాణ ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ సమయం తగ్గనుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఉండనున్నాయి. దీంతో తెలంగాణలో నేటి నుంచి ఆర్టీసీ సర్వీసులు సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని జిల్లాలకు ఆర్టిసి బస్సు సర్వీసులను నడుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి తెలంగాణలో 3,600 బస్సులు నడుస్తున్నాయని, అటు హైదరాబాద్ లో ఏకంగా 800…