సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ టికెట్ పై మహిళలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. పటాన్ చెరు నుంచి రుద్రారం వరకు ఆర్టీసీ బస్ లో మహిళలతో ముచ్చటించారు. ఫ్రీ టికెట్ పై మహిళల అభిప్రాయం తెలుసుకున్నారు జగ్గారెడ్డి. టికెట్ లేకుండా ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. టికెట్ లేని ప్రయాణం అంటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ 'మహాలక్ష్మి' ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖా, సీతక్క, సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పలువురు ఎమ్మెల్యేలు, , రవాణా శాఖ సెక్రటరీ వాణిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా…
మాములుగా అయితే మనం బస్సుల్లో సీటు దొరకడం కోసమని కట్చీఫ్ వేసి మరీ సీటు దొరకపట్టుకుంటాం. దొరకని వాళ్లు నిలబడి ప్రయాణం చేస్తారు. కానీ.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం అలా ఉండదు. బస్సులో నిలబడటానికి కూడా స్థలం ఉండదు. ఎందుకంటే అంత రష్ ఉంటుంది. సినిమాల్లో కనిపించే విధంగా రోడ్లన్నీ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దాంతో పాటు బస్సుల్లో ఎప్పుడు ప్రయాణికులు నిండి ఉంటారు. అయితే అక్కడి పరిస్థితి తెలిసి కొందరు.. సీటు…
తమిళనాడులోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి కేరళ వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. ధర్మపురి-సేలం జాతీయ రహదారిపై గెంగాళాపురం ప్రాంతంలో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ఆ బస్సు అందరూ చూస్తుండగానే.. మంటల్లో దగ్ధమైంది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం తప్పింది. కోటి నుండి పటాన్ చెరువు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. సరిగ్గా కేబీఆర్ పార్క్ వద్దకు రాగానే గమనించిన డ్రైవర్ చాకచక్యంగా.. ఎవరికి హాని కలగకుండా పార్క్ వైపు ఉన్న ఫుట్పాత్ పై బస్సును ఆపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్‌కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.