Burj Khalifa : సినిమా సెలబ్రిటీలు సంపాదించిందంతా ఆస్తులు కొనడానికే కేటాయిస్తారు. భూములు, బిల్డింగులు కొనేసి పెట్టుకుంటారు. మన దేశంలోనే కాదు బయటి దేశాల్లో చాలా మంది కొనేస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. దుబాయ్ కు వెళ్లిన ప్రతి ఒక్కరూ దాన్ని చూడాలని అనుకుంటారు. అలాంటి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్నాడు ఒక స్టార్ హీరో. ఇప్పటి వరకు బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఏకైక హీరో అతనే. ఆయన…
World most expensive shoes: ప్రపంచంలో ఒక జత షూ గరిష్ట ధర ఎంత అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే.., మీ సమాధానం బహుశా కొన్ని లక్షల రూపాయలు అని సంధానం రావొచ్చు. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్ల ధర మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. మూన్ స్టార్ షూస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ. దీని ధర రూ.163 కోట్లు. బంగారంతో తయారు చేసి, దానిపై వజ్రాలు పొదిగిన ఈ విలువైన షూని…
Burj Khalifa: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరున్న దుబాయ్‌లోని ‘‘బుర్జ్ ఖలీఫా’’పై భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్లే చేసింది. ఐకానిక్ బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణం వెలిగిపోయింది.
రాంలాలా ప్రాణప్రతిష్ట సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై రాముడి ప్రతిరూపాన్ని ప్రదర్శించే ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే, ఇంతకీ ఈ చిత్రం నిజమా? లేక ఎడిట్ చేసిన ఫోటో వైరల్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
Jeddah Tower: మనం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఏదంటే, టక్కున గుర్తుకు వచ్చేది దుబాయ్‌లోని ‘బుర్జ్ ఖలిఫా’. అయితే త్వరలో ఇది మారబోతోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టవర్‌గా సౌదీ అరేబియాలోని ‘జెడ్డా టవర్’ నిలవబోతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలోని ఓబుర్ ఉత్తర భాగంలో జెడ్డా ఎకనామిక్ సిటీ (JEC)లో ఈ ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. గతంలో దీన్ని కింగ్‌డమ్ టవర్‌గా పిలిచేవారు. దీనిని ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ రూపొందించారు. గతంలో బుర్జ్…
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీపా భవనంపై భారతదేశ జెండాను ప్రదర్శించారు. సరిగ్గా అర్థరాత్రి 12.01నిమిషాలకు ఎల్ఈడీ లైట్లతో మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. అంతేకాకుండా జాతీయ గీతాలాపన కూడా చేశారు. ఇలాంటి సన్నివేశాన్ని చూసిన ప్రతి భారతీయుడు ఆనందంతో పొంగిపోయారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని అందంగా ముస్తాబవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా జెండా ఎగరవేయనున్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాపై భారత జెండాను ప్రదర్శించారు. అర్ధరాత్రి (12 గంటల…
పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈసారి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రదర్శనలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించలేదు. దీంతో పాకిస్థానీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ దేశానికి మద్దతు తెలుపుతూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఇవాళ(శనివారం) యూఏఈకి వెళ్లారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకంతో పాటు మోడీ ఫోటోను ప్రదర్శించి గ్రాండ్‌గా వెల్ కమ్ పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.