Burj Khalifa : సినిమా సెలబ్రిటీలు సంపాదించిందంతా ఆస్తులు కొనడానికే కేటాయిస్తారు. భూములు, బిల్డింగులు కొనేసి పెట్టుకుంటారు. మన దేశంలోనే కాదు బయటి దేశాల్లో చాలా మంది కొనేస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. దుబాయ్ కు వెళ్లిన ప్రతి ఒక్కరూ దాన్ని చూడాలని అనుకుంటారు. అలాంటి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్నాడు ఒక స్టార్ హీరో. ఇప్పటి వరకు బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఏకైక హీరో అతనే. ఆయన ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.
Read Also : SSMB 29 : మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందా..?
ఆయన చాలా ఏళ్ల క్రితమే బుర్జ్ ఖలీఫాలోని 29వ అంతస్తులో 3.5 కోట్లు పెట్టి ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. ఇప్పుడు దాని విలువ భారీగా పెరిగిందని సమాచారం. దుబాయ్ లోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ లో 3బీహెచ్ కే ఫ్లాట్ ఉంది మోహన్ లాల్ కు. ఇవే కాకుండా ఇతర దేశాల్లోనూ మోహన్ లాల్ బాగానే ఆస్తులు కొన్నట్టు సమాచారం.
మన తెలుగు హీరోలకు కూడా దుబాయ్ లో ఫ్లాట్లు ఉన్నట్టు ప్రచారం ఉంది. చిరంజీవి, వెంకటేశ్, మహేవ్ బాబు, అల్లు అర్జున్ లకు దుబాయ్ తో పాటు లండన్, అమెరికాలో ఇళ్లు ఉన్నాయనే ప్రచారం ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆస్తులు కొనడానికి హీరోలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Read Also : Balakrishna : నన్ను చూసుకునే నాకు పొగరు.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్