కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండి నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా కరోనా బారి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులు కరోనా బారిన పడితే, ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే ఉండటం చేస్తారు. ఇక పల్లేల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెల్లో కరోనా బారిన పడిన వ్యక్తులు ఊరికి దూరంగా ఉంటున్నారు. కరోనా తగ్గేవరకు గ్రామంలోకి అడుగుపెట్టడంలేదు. అయితే, తెలంగాణలోని ఖమ్మంజిల్లా,…