బీచ్ అంటేనే ఆహ్లాదం.. ఉల్లాసం.. సంతోషం.. పైగా న్యూఇయర్ సమయం. పాత ఏడాదికి గుడ్‌బై చెప్పి.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న సమయం. అయితే ఇద్దరు ముంబై టూరిస్టులు ఉదయం బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు.
ఆస్తుల కోసం తోబుట్టువులను దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఓ అన్న తన చెల్లెలి కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన దుర్గారావు తన చెల్లి కోసం హస్తిన బాట పట్టాడు. తన సోదరి నవ్యతను చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ కిచ్చి 2018లో పెళ్లి చేశాడు. కట్నంగా 23 లక్షల డబ్బు బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చాడు.…
పెళ్లంటే బాజాలు, భజంత్రీలు, డ్యాన్సులు, హంగామా ఉంటుంది. వీటి గురించి మనుషులకు తెలుసు. కానీ ఆవులు,గేదెలు, ఎద్దులకు తెలియదు. కొన్ని ఎద్దులు డప్పు శబ్దానికి బెదిరిపోయి పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లాలోని రామళ్లకోట గ్రామంలో ఓ పెళ్లి తంతు జరుగుతున్నది. బాజాభజంత్రీలతో పెళ్లి ఊరేగింపు ముందు వెళ్తుండగా వెనుకనుంచి కాడెద్దులు బండితో సహా పరుగులు తీశాయి. ఈ బండి పెళ్లి ఊరేగింపు మీద నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో…
దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిపోయింది. పెట్రోల్‌ధరలకు భయపడి వాహనాలను బయటకు తేవడంలేదు. కొంతమంది పబ్లిక్ వాహనాలను వినియోగిస్తుంటే, మరికొందరు సంప్రదాయ వాహనాలను వినియోగిస్తున్నారు. గతంలో ఎలాగైతే రవాణాకోసం ఎడ్ల బండ్లను వినియోగించేవారో, ఇప్పుడు కొన్ని చోట్ల వాటిని తిరిగి వినియోగించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు పెళ్లిళ్లకు ఇలాంటి ఎడ్లబండిమీదనే వెళ్లేవారు. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మరలా ఎడ్లబండివైపు చూస్తున్నారు. Read: ‘తలైవి’కి తమిళంలో…