దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిపోయింది. పెట్రోల్‌ధరలకు భయపడి వాహనాలను బయటకు తేవడంలేదు. కొంతమంది పబ్లిక్ వాహనాలను వినియోగిస్తుంటే, మరికొందరు సంప్రదాయ వాహనాలను వినియోగిస్తున్నారు. గతంలో ఎలాగైతే రవాణాకోసం ఎడ్ల బండ్లను వినియోగించేవారో, ఇప్పుడు కొన్ని చోట్ల వాటిని తిరిగి వినియోగించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు పెళ్లిళ్లకు ఇలాంటి ఎడ్లబండిమీదనే వెళ్లేవారు. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మరలా ఎడ్లబండివైపు చూస్తున్నారు.
Read: ‘తలైవి’కి తమిళంలో ‘యు’ సర్టిఫికెట్!
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా, కుషారియా గ్రామానికి చెందిన ఛోటేలాల్ అనే వ్యక్తి తన పెళ్లికి కావాల్సని సరంజామా, పెళ్లి బృందంతో కలిసి ఎడ్ల బండిపై 35 కిలోమీటర్లు ప్రయాణం చేసి పెళ్లిమండపానికి చేరుకున్నారు. అందరిలోనూ అవగాహన కల్పించేందుకు ఇలా చేసినట్టు వరుడు తెలిపాడు. చిన్నతనం నుంచి ఎద్దుల బండిపై వెళ్లి వివాహం చేసుకొవాలని ఉండేదని, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం కలిసి వచ్చిందని వరుడు తెలిపాడు. ఇప్పుడు దీనికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.