GHMC : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సీరియస్ అయింది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి అనుమతుల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలడంతో, సంబంధిత భవనానికి ఇచ్చిన అనుమతులను బల్దియా రద్దు చేసింది. అపార్ట్‌మెంట్ నిర్మాణంలో సెట్ బ్యాక్ లేకపోవడంతో పాటు, బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయకుండా సెల్లార్ తవ్వకాలు జరిపినట్టు విచారణలో స్పష్టమైంది. అంతేగాక, ఈ తవ్వకాలు GHMC అధికారుల అనుమతి లేకుండా జరిగినట్టు…
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నగరంలో చెరువులను, కాలువలను, ఫుట్‌పాత్‌లను, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వందరోజులు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు.