ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు.
కొంత మంది రాజకీయ నాయకులు, సొంతంగా ప్రకటించుకున్న ఆర్ధిక నిపుణులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా రాష్ట్ర అప్పుల గురించి వివరించారన్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. దీంతో టీడీపీ, వాళ్ళ మీడియా బాధ మామూలుగా లేదని, ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పుల పై స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్నారు.
AP Budget: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న గురువారం కొత్త పొద్దు పొడిచింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి కొత్త పద్దు సమర్పించారు. 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. కీలక రంగాల్లో ఒకటైన సంక్షేమానికి అత్యధికంగా 51 వేల 345 కోట్ల రూపాయలు కేటాయించారు. అనంతరం.. వ్యవసాయానికి 41 వేల 436 కోట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత.. విద్యకు 32 వేల 198 కోట్ల రూపాయిలు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Global Investors Summit 2023: ‘నైపుణ్యం కలిగిన మానవ వనరులకు, సహజ వనరులకు కొదవలేదు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండి అంటూ పారిశ్రామిక దిగ్గజాలకు స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం…
Buggana Rajendranath: కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జన సభకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలన్నారు. కరువు కారణంగా కాళేబరాలు కూడా పూడ్చిపెట్టిన ప్రాంతం రాయలసీమ అన్నారు. ఒక్క మగాడు సీఎం జగన్ హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. హంద్రీనీవాకు మొదట చంద్రబాబు రూ.13 కోట్లు ఇస్తే వైఎస్ఆర్ రూ.4 వేల కోట్లు ఇచ్చింది నిజం కాదా అని…