బట్టలు లేకుండా రోడ్డుపై వ్యక్తి.. పోలీసులపైనే దాడి
సోషల్ మీడియా వాడుకలో కి వచ్చాక రోజుకో వింత దర్శనం ఇస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగిన క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది . అలాంటి వింత ఘటన తాజాగా లాస్ వెగాస్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. మంగళవారం రాత్రి లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ పోలీసులకు బ్లూ డైమండ్ రోడ్, బఫెలో డ్రైవ్ సమీపంలో ఒక వ్యక్తి నగ్నంగా తిరుగుతున్నాడని పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి ఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని గుర్తించారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసు అధికారి విచారించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా.. మైనంపల్లి పై హరీష్ రావ్ ఫైర్
కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా అంటూ మైనంపల్లి పై మంత్రి హరీష్ రావ్ మండిపడ్డారు. మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషి మాటలు, ముఠాల మనిషి మధ్య పోటీ అన్నారు. మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయమన్నారు. కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా? అని ప్రశ్నించారు. 28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. దత్తత తీసుకొని అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా అని మంత్రి అన్నారు. ఏ సర్వే చూసినా 75 నుండి 80 సీట్లతో బిఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కర్ణాటకలో కుర్చీల కొట్లాట జరుగుతున్నది. ఒకర్ని దించాలే, మరొకరిని ఎక్కించాలన్నారు. కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందని తెలిపారు.
బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. 35 మందితో లిస్ట్ రిలీజ్ చేశారు. ఇది వరకు 53 మంది పేర్లను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 31 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ జాబితాలో మూడు ఎస్టీ, 5 ఎస్సీ నియోజక వర్గాల అభ్యర్థులు ప్రకటన.. ఇప్పటి వరకు ఎస్సీ 13, ఎస్టీ- 9 నియోజక వర్గాలు కేటాయింపు. ఇంకా ఎస్టీ 3, ఎస్సీ 6 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక, మూడో జాబితాలో ఒక మహిళకు చోటు కల్పించారు.
టెర్రర్ గ్రూపులకు నార్త్ కొరియా ఆయుధాలు.. విక్రయించేందుకు కిమ్ ప్రయత్నం..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేవలం మధ్యప్రాచ్యానికే కాకుండా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇజ్రాయిల్‌కి మద్దతుగా యూరప్, అమెరికా దేశాలు నిలిస్తే, పాలస్తీనాకు మద్దతుగా అరబ్ ప్రపంచం నిలబడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ పై ఒక్క హమాస్ కాకుండా లెబనాన్ నుంచి హిజ్బుల్లా, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు, రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్యప్రాచ్యంలోని టెర్రర్ గ్రూపులకు ఆయుధాలు విక్రయించే అవకాశం ఉందని దక్షిణ కొరియా గూఢచార సంస్థ తెలిపింది. అణుకార్యక్రమాల కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, గతంలో హమాస్ ఉగ్రసంస్థకు యాంటీ ట్యాంక్ రాకెట్ లాంచర్ విక్రయించిందని, దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు తెలిపారు. గాజాలో యుద్ధం మధ్య ఉత్తరకొరియా మరిన్ని ఆయుధాలు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. యుద్ధం నుంచి ప్రయోజన పొందేందుకు కిమ్ జోంగ్ ఉన్ పాలస్తీనాకు విస్తృత మద్దతు ప్రకటించారని దక్షిణ కొరియా ఇంటలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ కిమ్ క్యూ హ్యూన్ చట్టసభ సభ్యులకు వెల్లడించారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సజ్జల
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు.. ఏడు విలీన మండలాల ప్రజలు మళ్ళీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్ళమని స్పష్టం చేశారు అని ఆయన తెలిపారు. అక్కడ ఏం లేవో కూడా చెప్పుకుంటే బాగుంటుంది.. సరిహద్దు గ్రామాల ప్రజలు మాకు జగన్ ముఖ్యమంత్రి గా కావాలి అంటున్నారు.. ఏపీలో పెన్షన్ అద్భుతంగా అమలు అవుతుందని కేసీఆర్ స్వయంగా చెప్పారు.. ఏపీలానే తాము కూడా పెన్షన్లు అమలు చేస్తామని కూడా కేసీఆర్ చెప్పారు.. కోటి 60 లక్షల కుటుంబాల్లో కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి జరిగింది అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
“ఇండియా కూటమిలో ఊపు లేదు”.. బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు..
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలంతా కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి సీట్లు కేటాయించపోవడంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గుర్రుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమికి తొలిసమావేశాన్ని నిర్వహించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో మొదట ఉన్న పురోగతి, ఊపు ఇప్పుడు లేదని దానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉందని, దీంతోనే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదని ఆయన అన్నారు.
దళిత సమాజాన్ని ఉద్దరించాలన్నదే మా లక్ష్యం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. రోజుకు మూడు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మూడో సారి రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగుతున్నాయని, 75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ప్రజా స్వామ్య పరిణితి రావాల్సిన స్థాయిలో రాలేదు. ఏ దేశాల్లో వచ్చిందో అవి మనకంటే ముందుకు వెళ్లిపోతున్నాయి. అభివృద్ధి కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో నేను చెప్పిన మాటలు చర్చ పెట్టాలని, 30న ఓట్లు పడుతాయి. 3న లెక్కిస్తారు. ఎవరో ఒకరు గెలుస్తారన్నారు సీఎం కేసీఆర్.
ఏపీ అప్పులపై టీడీపీ అబద్ధాలు చెబుతుంది..
హైటెక్ సిటీలో టీడీపీ కన్సర్ట్ పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ పదే పదే అబద్దాలు చెప్పి వాటిని నిజం చెయ్యాలని అనుకుంటారు.. గచ్చిబౌలి స్టేడియంలో కొందరిని చూశాను.. వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి.. చంద్రబాబు దిగిపోయే నాటికి ఐటీలో మనం 5వ స్థానానికి పడిపోయాం.. చంద్రబాబు కంటే ముందు మన రాష్ట్రం ఐటీలో మూడో స్థానంలో ఉండేది అని ఆయన పేర్కొన్నారు. మరి చంద్రబాబు వల్ల ఐటి పెరిగినట్టా..? తగ్గినట్టా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల విస్తరణ జరగాల్సిన ఐటి దెబ్బతింది.. చంద్రబాబు ఐటి కంపెనీకి కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చాడు అని మంత్రి బుగ్గన మండిపడ్డారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ చీఫ్ కుమారుడికి ఈడీ సమన్లు..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడవు ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల్ని పాత కేసులు వెంటాడుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో రాజస్థాన్ పోలీసులు అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగా ప్రస్తుతం ఈడీ మనీలాండరింగ్ కేసును విచారిస్తోంది. అయితే ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఎన్నికలు ఉన్నాయనే కేంద్రంలోని బీజేపీ, కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతోందని ఆరోపిస్తున్నారు.
డిసెంబర్ 3న ఉప ఎన్నిక విజయమే మళ్ళీ రిపీట్ అవుతుంది
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ కు తప్ప వేరే పార్టీకి ఓటు వేసే ప్రసక్తి లేదని ప్రజలు అంటున్నారన్నారు. కష్ట సుఖాల్లో ఆదుకున్న ఈటలకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. రెండు చోట్ల పోటీ చేస్తానాన్న ఈటలకు రెండు ప్రాంతాలు రెండు కళ్లలాంటివి అన్నారు.
మా సారూ గెలువాలే, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలానేది ప్రజల నినాదమని, ఈటల రాజేందర్ నియోజక వర్గంలో లేకున్న ప్రజల కష్ట సుఖాల్లో నేను తోడు ఉన్నానన్నారు. మేమంటే హుజురాబాద్ ప్రజలకు ఇష్టం, వారంటే మాకు ఇష్టమన్నారు. కాబట్టే ఈటలను ఏడు సార్లు గెలిపించారని ఆమె వ్యాఖ్యానించారు. డిసెంబర్ 3న ఉప ఎన్నిక విజయమే మళ్ళీ రిపీట్ అవుతుందని ఈటల జమున ధీమా వ్యక్తం చేశారు.
కోహ్లీ మరో అరుదైన రికార్డ్.. సచిన్ను దాటేసిన రన్ మిషన్
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ఈ ఘనతను సాధించాడు.
ఇదిలా ఉంటే రన్ మిషన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కుపైగా పరుగులు సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆ రికార్డ్ ను చెరిపేశాడు. ఇదిలా ఉంటే.. సచిన్ తన వన్డే కెరీర్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 7 సార్లు 1000కు పైగా పరుగులు నమోదు చేశాడు.
రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనేశ్వరం కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికల వేళ ఆయా పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ అంటూ విమర్శలు గుప్పించారు. వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారని, మహా ఇంజనీర్లు వీళ్ళు బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎక్స్పానషన్ లెవల్ ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫోటోలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది వీళ్ళ అవగాహన అని ఆయన ఎద్దేవా చేశారు. జనాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ లోని ఈ చిల్లర గాళ్ళు అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.