ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023-24 ఆర్థిక సంవత్సరానిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీవన ప్రమాణాలను పెంచే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. వార్షిక బడ్జెట్ రూ.2,79,279 కోట్లు అని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ.38,605, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా సంక్షేమ పథకాలకు రూ.54,228.36 కోట్లు, ఎస్సీలకు రూ.20,005 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
Also Read : Crime News: అద్దెకు ఉంటున్న వ్యక్తితో తల్లి అఫైర్.. అడ్డొచ్చిన కూతురిని అతి కిరాతకంగా..
అంతేకాకుండా.. స్థూలవృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ వృద్ధి 11.43 శాతమని, రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాది అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని, ఆర్బీకేల పనితీరును నీతి ఆయోగ్ ప్రశంసించిందని ఆయన వెల్లడించారు. పొలం బడి కార్యక్రమాల ద్వారా దిగుబడి పెరిగిందని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. తన ప్రసంగంలో ప్రారంభంలో ప్రముఖుల సూక్తుల్ని ప్రస్తావించారు బుగ్గన. వాటి ఆధారంగానే తమ ప్రభుత్వం సంక్షేమంతో పాటు ఇతర కార్యక్రమాల్ని చేపడుతోందన్నారు.
Also Read : TS MLC Elections: బండిల్స్ పంపిణీలో గందరగోళం.. మొదటి రౌండ్ ఫలితాలు ఇక అప్పుడే..