అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు, ఎలుగుబంట్ల, ఏనుగులు జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులుల అలజడి జనానికి కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ చిరుత పులి అలజడి కలిగిస్తోంది. గాలివీడు మండలం అరవీడు గ్రామం నడింపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులి హల్ చల్ చేసింది. మేతకు అడవికి వెళ్ళిన మేకల మంద పై దాడి చేసి రెండు మేకలను చంపింది చిరుత పులి. దీంతో ప్రాణ భయంతో అటవీ ప్రాంతం నుంచి…
ఏపీలో ఒకవైపు ఏనుగులు, మరోవైపు పులులు సంచారంతో జనం హడలిపోతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీసీ కెమెరాలో పులి కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. గత పది రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం…