ఎన్నికల ముందు కేంద్రం తాయిలాలు ప్రకటించబోతుందా? మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టేందుకు మోడీ సర్కార్ ప్రణాళికలు వేసిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నదాతలకు, ప్రజలకు తాయిలాలు ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ వంటి పథకాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం…
2022 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడారు.దేశ వ్యాప్తంగా మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, డిజిటల్ ఇండియా సాధనతో ఆత్మనిర్భర భారత్ సాధికారత సాధ్యమయ్యేలా బడ్జెట్ రూప కల్పన చేశారన్నారు. పీఎం గతిశక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నుండి మొదలుకుని ఆవాస్ యోజన ద్వారా పేదలకు 18 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం…
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి వచ్చిన నిర్మలాసీతారామన్ ఆర్థిక శాఖ అధికారులతో కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్ కు వచ్చారు.సీతారామన్ సంప్రదాయ బహీ ఖాతాకు బదులుగా ట్యాబ్‌ను ఉపయోగించి పార్లమెంటులో 2022 బడ్జెట్‌ను సమర్పించ నున్నారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 3.45 గంటలకు విలేఖరుల సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.…
బడ్జెట్ పద్దులపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. పద్దుల నిర్వహణలో పొరపాట్లను సరిదిద్దుతోంది. బడ్జెట్ కేటాయింపుల వినియోగ లెక్కలను ఇవ్వాలని అన్ని శాఖలను ఆదేశించింది.బడ్జెట్ పద్దుల సరైన నిర్వాహాణకు చర్యలు ప్రారంభించింది ఆర్ధిక శాఖ. పద్దుల నిర్వహాణలో వివిధ శాఖల్లో జరుగుతోన్న పొరపాట్లను సరిదిద్దుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్ని నిధులు వినియోగించారో చెప్పాలని ఆదేశించింది. అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. కేటాయిపుల్లోని హెచ్చు తగ్గులు, ఆదా చేసిన లెక్కలకు సంబంధించిన వివరాలతో పాటు.. వాటికి వివరణ…
ఏపీ ప్రభుత్వం ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాములా మారింది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తోంది ఆర్ధిక శాఖ. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయిన ఏపీ…గత ఏడాది సుమారు 1.82 లక్షల…