కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి వచ్చిన నిర్మలాసీతారామన్ ఆర్థిక శాఖ అధికారులతో కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్ కు వచ్చారు.సీతారామన్ సంప్రదాయ బహీ ఖాతాకు బదులుగా ట్యాబ్‌ను ఉపయోగించి పార్లమెంటులో 2022 బడ్జెట్‌ను సమర్పించ నున్నారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 3.45 గంటలకు విలేఖరుల సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్రమంత్రి రాష్ట్రపతి కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.