Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు స్టార్ట్ అయ్యాయి. బడ్జెట్ మీదనే ప్రధానంగా సాగనున్న ఈ సమావేశాలు మార్చి 27 వరకు జరుగుతాయి. 14న హోలీ, 16న ఆదివారం, 20, 23న సెలవులు ఉన్నాయి. ఈ నాలుగు రోజులు మినహాయించి 12 రోజులు కంటిన్యూగా సమావేశాలు జరగబోతున్నాయి. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగిస్తారు. అటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ…
Governor Jishnu Dev Varma : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల హోరాహోరీతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయన ప్రసంగం మధ్యలోనే బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ, సామాజిక న్యాయం, సంక్షేమం పట్ల ప్రభుత్వ కట్టుబాటును…
KCR : బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా, ఆయన హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంగా, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నందినగర్‌కు చేరుకొని “కేసీఆర్ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడంతో పాటు ఆయన కారుపై పూలు చల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా…
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జులై 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలను కేంద్రం పొడిగించింది. జనవరి 31న లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసటించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయబోతున్నారు.
కేంద్ర బడ్జెట్ అంటేనే అందరికీ గంపెడాశలుంటాయి. పైగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల జాతర జరగబోతుంది. దీంతో బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా వరాలు ప్రకటించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మోడీ సర్కార్ మరోసారి వచ్చేందుకు బడ్జెట్‌ను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ఉద్యోగులైతే ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరీ నిర్మలాసీతారామన్ ఎలాంటి వరాలు కురిపిస్తారోనని అందరూ ఎదురుచూస్తు్న్నారు.
ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు, ఉద్యోగులు, అన్నదాతలు, రాష్ట్ర ప్రభుత్వాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఏమైనా వరాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఇక బడ్జెట్ మర్మమేంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.