సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్‌లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఇదే చివరి ప్రసంగం కానుంది. ఎందుకంటే ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం.. లోక్‌సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నాడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. Read Also: రైల్వే శాఖ కీలక నిర్ణయం: నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉ. 10 గంటల నుంచి సా. 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. ఫిబ్రవరి…
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం, వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాలకు ముందుగా ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. …
2020 నుంచి దేశం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నది. గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు అనేక మార్లు వాయిదా వేస్తూ వచ్చాయి. కరోనా కంట్రోల్ లోకి రావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత వరసగా ఎన్నికలు జరిగాయి. మే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. బడ్జెట్ సమావేశాలను జూన్ 3 లోగా తప్పనిసరిగా…