డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఓ విజ్ఞప్తి చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. నేను ఒక కామన్ మెన్‌గా దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా.. 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.. చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి అంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఒకరు కోడి గుడ్ల మీద ఈకలు పీకుతాడన్నారు. మచిలీపట్నం లో అత్యధిక మెజారిటీ తో నిన్ను, నీ కుమారుడిని ఓడించారని, ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారన్నారు బుద్దా వెంకన్న. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే… జగన్ అప్పుల…
Buddha Venkanna: గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వేల కోట్లు దోచేశారు.. ఇదంతా జగన్ డైరెక్షన్లో జరిగింది అని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమికి వస్తాయని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. అమరావతిలోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువనేశ్వరి డిసైడ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక, చంద్రబాబు ఆత్మ కథలో నాకో పేజీ ఉంటుంది.
పొత్తులు, టిక్కెట్ కేటాయింపు విషయంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆసక్తికర కామెంట్లు చేశారు. అనకాపల్లి పార్లమెంట్ లేదా విజయవాడ పశ్చిమలో రెండిట్లో ఓ సీటు తనకు ఇస్తారని.. తాను పోటీ చేస్తానని తెలిపారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానని చెప్పారు. నా నాలుక కోసుకుంటాను కానీ.. చంద్రబాబుని ఎప్పుడు విమర్శించనన్నారు. చంద్రబాబును అలా విమర్శించాల్సిన రోజే వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానని పేర్కొన్నారు. మరోవైపు.. టీడీపీలో…
విజయవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ - జనసేన మధ్య ముసలం మొదలైంది.. టీడీపీ నేతలు బాద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌పై జనసేన పశ్చిమ ఇంఛార్జ్ పోతిని మహేష్ విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు వీరంతా ఎక్కడున్నారు? అంటూ ఫైర్ అయ్యారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని ఆయన అన్నారు. కేశినేని నాని దెబ్బకు వైసీపీలో ఓ వికెట్ పడిందన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు..అలాంటి నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా జరిగారని ఆరోపించారు.