బెజవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. టికెట్ తనకు ఇవ్వాలని దుర్గగుడికి ర్యాలీగా వెళ్లి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బల ప్రదర్శన చేయగా.. మైనార్టీలకు ఈ టికెట్ ఇవ్వక పోతే ఉరి వేసుకుంటారో, ఇంకా ఏం చేస్తారో తెలియదని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వార్నింగ్ ఇస్తున్నారు.
చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు బుద్దా వెంకన్న.. ఇక, ర్యాలీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టికెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నాకు దైవ సమానులు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చాను. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు
కోవర్టు నాని ఊసరవెల్లి.. లాగా బిహేవ్ చేస్తున్నాడని కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబ్బా కొడుకులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయారం... గాయారం టైప్ అని.. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కట్టిన ప్రతి ఫ్లై ఓవర్ చంద్రబాబు కట్టించిందేనని తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఫ్లై ఓవర్ కట్టడానికి తనకు సంబంధించిన సోమా కంపెనీకి ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టాడని.. చంద్రబాబు…
టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఇంకా ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై పోటీ పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం టిక్కెట్ విషయంలో పెరుగుతున్న పోటీ. విజయవాడ పశ్చిమ టికెట్ కోసం అంతర్గతంగా టీడీపీ-జనసేన కూటమిలో పోటీ పెరుగుతోంది.
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్ధం ఆయన వ్యాఖ్యానించారు. కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత..?.. తిరిగి చెల్లించింది ఎంత..?.. తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా..? అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.
కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంట్రా నాని అంటూ తీవ్రంగా మండిపడ్డారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడని.. చంద్రబాబు రెండు సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని బుద్దా వెంకన్న చెప్పారు.
మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం అని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందన్నారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 1932లో జనవరి 4న గాంధీ అరెస్టు ఎలా గుర్తుందో.. 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో ప్రజలకు అలానే…
Buddha Venkanna: కాపులు వంద శాతం పవన్ కల్యాణ్‌కే ఓటేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.. అసలు అమర్నాథ్ వన్ టైం ఎమ్యెల్యే అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, చంద్రబాబు ఇంటి గేటును టచ్ చేస్తే రాష్ట్రం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు బుద్ధా వెంకన్న.. పోలీసులుతో కాకుండా మీ పార్టీ పిచ్చికుక్కలను…