సిద్దిపేటలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాఉడతూ.. కలలో కూడా సిద్దిపేటకి ఐటీ టవర్ వస్తుందని అనుకోలేదన్నారు. సిద్దిపేట జిల్లా అయ్యి ఐటీ టవర్ వచ్చిందంటే తెలంగాణ తెచ్చిన కేసీఆరే కారణమని ఆయన కొనియాడారు. సిద్దిపేటలో చదివిన బిడ్డలు సిద్దిపేటలోనే ఐటీ ఉద్యోగం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో మరికొన్ని పరిశ్రమలు తెస్తామన్నారు హరీష్‌రావు.
Also Read : Guinness World Record: 3.13 సెకన్లలో రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసి గిన్నిస్ రికార్డు.. వీడియో వైరల్
మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటుందన్నారు. తెలంగాణ వస్తే చాలా అనుమానాలు క్రేయేట్ చేశారని, ఎవరైతే కేసీఆర్ ని తిట్టారో ఆ నోళ్లే ఇప్పుడు కేసీఆర్ ని మెచ్చుకుంటున్నాయన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తున్నారన్నారు. అంతేకాకుండా.. మరో సారి మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. గతంలో ఎందరో పాలించారని, విజన్ 2020 అన్నారు..హైటెక్ అన్నారని, కానీ వాళ్ళ వల్ల కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందన్నారు. మరో సారి సీఎం కేసీఆర్‌ని గెలిపించి హ్యాట్రిక్ గెలుపు అందివ్వాలన్నారు.
Also Read :Health Tip: మిరియాలతో దీన్ని కలిపి తీసుకుంటే కంటి చూపు పెరుగుతుంది..