Komatireddy Venkat Reddy : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద చిన్న పూజలు చేసి SLBC టన్నెల్ కూలిపోవాలని కోరిక వ్యక్తం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్స్ పాలన కారణంగానే SLBC టన్నెల్ పనులు ముందడుగు వేసుకోలేదని అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా దోపిడీ, దాచుకోవడంలో మాత్రమే మునిగిపోయిందని విమర్శించారు.
Sai Durga Tej : నాకు ఆమెనే గుర్తొస్తోంది.. సాయిదుర్గాతేజ్ ఫన్నీ కామెంట్స్
ఇప్పుడిప్పుడే వారు అధికారంలోకి వచ్చి ప్రతీ అంశాన్ని సరిచేస్తూ ముందుకు వెళ్లుతున్నారని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి చర్యలు చూసితే కేసీఆర్‌కు అసహనం కలిగిందని విమర్శించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందించడం, గ్యాస్ సిలిండర్ రూ.500కి అందించడం, రైతు భరోసా పథకం, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, 60,000కి పైగా ఉద్యోగాల కల్పన వంటి పనులన్నీ తాము చేసిన విషయాలు అని పేర్కొన్నారు.
Anas Al-Sharif: ఉగ్రవాదా.. జర్నలిస్టా.. గాజాలో మరణించింది ఎవరు?