కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. పొందుర్తి వద్ద ఆయనకు బీజేపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష 20 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కుంగిపోతుందని విమర్శించారు. 80 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు.. కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎవ్వరో ఒక్కరు గెలుస్తారని చెప్పారు. ఎన్నికల్లో నిలబడే వ్యక్తి ఎవ్వరో చూడాలని.. ఏ పార్టీ చరిత్ర ఏంటో చూడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వజ్రాయుధం.. ఆలోచించి ఓటు వేయాలని ఆయన తెలిపారు.
స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా.. రాంగ్ లీడర్లు మనకెందుకు అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రోగ్రాం సంగారెడ్డిలో ఫెయిల్ అయ్యిందన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన మన మీటింగ్ కి వచ్చినంత మంది రాలేదని వ్యంగాస్త్రాలు సంధించారు.
CM KCR: తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు నిలబడితే గెలవాలంతే..! అంటూ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మూడు జిల్లాలో పర్యటనలో భాగంగా.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో టిటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు.
Kaleru Venkatesh: వచ్చే ఎన్నికల్లో రెండోసారి అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కెసిఆర్ కు కానుకగా ఇస్తానని అంబర్పేట్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.
Padi Kaushik Reddy: దయచేసి ఎమ్మెల్యేగా ఒక్క సారి అవకాశం ఇవ్వండి ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి, కనగర్తి, మల్యాల, లక్ష్మాజిపల్లి గ్రామాల్లో ప్రచారంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..
CM KCR: సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజ శ్యామలా యాగం తుది దశకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ రాజ శ్యామలా యాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Ponguleti: అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎన్ని ఇచ్చినా మీరు తీసుకోండి అవి మనవే అని ఓటు మాత్రం హస్తం గుర్తుపై వేయండని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు మునిగే పల్లి గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Pallapu Govardhan: బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ చిక్కుల్లో పడింది. తెలంగాణ బీజేపీలో మంచి ఊపు తెచ్చిన బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతోనే సమస్య మొదలైంది.
ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. ఇక, ఈనెల 30న పోలింగ్ నిర్వహించనుండగా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్, ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండనుంది.