నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాడు పార్టీ ఎన్నికల ర్యాలీలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కేటీఆర్, ఆయన పార్టీ క్యాడర్ ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ వాహనం రెయిలింగ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. బీఆర్‌ఎస్ నుండి అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో మంత్రి కేటీఆర్‌కు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. అయితే.. ఆయన వెంట ఉన్న ఎంపీ సురేష్ రెడ్డికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ప్రచార రథం ఎత్తుగా ఉండటంతో పాటు.. రన్నింగ్‌లో ఉండగా ఈ ప్రమాదం చోటు చేటు చేసుకుంది. అయితే లక్కీగా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తర్వాత జీవన్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
ఇదిలా ఉంటే.. కొడంగల్‌లో ఆయన రోడ్‌షోకి తలపెట్టినట్లు కూడా పార్టీ తెలిపింది. గురువారం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి కేటీఆర్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కేటీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి కొండం కరుణ మహేందర్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మల్లుగారి నర్సాగౌడ్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.