Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎడవెళ్ళి నుంచి కార్యక్రమాలు కొనసాగించడం నా సాంప్రదాయం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బలైపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కమీషన్లు, ఆగమాగం పనులు చేయడంతోనే మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరిగేషన్ విభాగాన్ని, ఇంజనీరింగ్ అధికారులను పని చేసుకోనివ్వకుండా తానే ఇంజనీర్ అని కేసీఆర్ అహంభావం ప్రదర్శించినందుకు.. కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరి నీళ్ల పాలైందని ఆరోపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. ఆయన రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొనాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సోమాజిగూడలోని కత్రియ హోటల్ లో నూతన మీడియా సెంటర్ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవడేకర్, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సరిగ్గా ఒక్క నెల సమయం ఉంది.. ఇవాళ నామినేషన్ లు మొదలయ్యాయి... సరిగ్గా ఒక్క నెలలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. రాష్ట్ర రూపు రేఖలు మారబోతోందని పేర్కొన్నారు.
జహీరాబాద్ లో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులేనని.. మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా ..?అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ…
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. పొందుర్తి వద్ద ఆయనకు బీజేపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష 20 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కుంగిపోతుందని విమర్శించారు. 80 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు.. కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎవ్వరో ఒక్కరు గెలుస్తారని చెప్పారు. ఎన్నికల్లో నిలబడే వ్యక్తి ఎవ్వరో చూడాలని.. ఏ పార్టీ చరిత్ర ఏంటో చూడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వజ్రాయుధం.. ఆలోచించి ఓటు వేయాలని ఆయన తెలిపారు.
స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా.. రాంగ్ లీడర్లు మనకెందుకు అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రోగ్రాం సంగారెడ్డిలో ఫెయిల్ అయ్యిందన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన మన మీటింగ్ కి వచ్చినంత మంది రాలేదని వ్యంగాస్త్రాలు సంధించారు.
CM KCR: తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు నిలబడితే గెలవాలంతే..! అంటూ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మూడు జిల్లాలో పర్యటనలో భాగంగా.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో టిటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు.