గోల్నాక డివిజన్లో ఎమ్మెల్యే కాలేరు ఎన్నికల ప్రచార పాదయాత్ర లో జనం భారీగా పాల్గొన్నారు. అంబర్ పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. గోల్నాక డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. breaking news, latest news, telugu news, Kaleru Venkatesh, brs
Kishan Reddy: కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు లక్షల కోట్లు అప్పు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంధకార భవిష్యత్తుగా మారిందని వ్యాఖ్యానించారు.
Revanth Reddy: బండి సంజయ్ ని పదవి నుండి తప్పించిన తర్వాత బుర్ర పని చేస్తున్నట్టు లేదని టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి పరిధిలో ఉండే కమిటీనే.. తప్పు జరిగింది అని చెప్పిందన్నారు.
CM KCR: ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. రేపు ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ ఆర్ కళాశాలలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభకు మంత్రి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎడవెళ్ళి నుంచి కార్యక్రమాలు కొనసాగించడం నా సాంప్రదాయం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బలైపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కమీషన్లు, ఆగమాగం పనులు చేయడంతోనే మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరిగేషన్ విభాగాన్ని, ఇంజనీరింగ్ అధికారులను పని చేసుకోనివ్వకుండా తానే ఇంజనీర్ అని కేసీఆర్ అహంభావం ప్రదర్శించినందుకు.. కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరి నీళ్ల పాలైందని ఆరోపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. ఆయన రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొనాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సోమాజిగూడలోని కత్రియ హోటల్ లో నూతన మీడియా సెంటర్ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవడేకర్, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సరిగ్గా ఒక్క నెల సమయం ఉంది.. ఇవాళ నామినేషన్ లు మొదలయ్యాయి... సరిగ్గా ఒక్క నెలలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. రాష్ట్ర రూపు రేఖలు మారబోతోందని పేర్కొన్నారు.
జహీరాబాద్ లో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులేనని.. మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా ..?అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ…