Ram Reddy Damodar Reddy: కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన తుది జాబితాలో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డితో అధిష్టానం మాట్లాడుతుందని ఆయన తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ అభివృద్ధి కోసం రమేష్ రెడ్డి కష్టపడి పనిచేశారన్నారు. రమేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సముచిత స్థానం ఇవ్వాలని కోరానని తెలిపారు. రమేష్ రెడ్డితో వివాదం లేకుండా ఇద్దరం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. టికెట్ రాలేదన్న బాధను అర్ధం చేసుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి రమేష్ రెడ్డి కట్టుబడి ఉంటారన్న నమ్మకం ఉందని అన్నారు. బీఆర్ఎస్ ను ఓడించాలన్నదే మా ఇద్దరి లక్ష్యమని రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు.
Read Also: Election Campaign: ఎన్నికల ప్రచారంలో అపశృతి.. 10 మంది మహిళలకు తీవ్ర గాయాలు
ఇదిలా ఉంటే.. సూర్యాపేట స్థానం నుండి టిక్కెట్టు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేత పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించేందుకే రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు పోటీ పడ్డారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ సాగగా.. చివరకు రాంరెడ్డి దామోదర్ రెడ్డికే కాంగ్రెస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికి వారు ప్రచారం నిర్వహించినప్పటికీ, కాంగ్రెస్ తుది జాబితాలో రాంరెడ్డి దామోదరర్ రెడ్డికి టిక్కెట్ దక్కింది.
Read Also: Vidadala Rajini: బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి జగన్…