Telangana: తెలంగాణలో 4 వేలకు పైగా నామినేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియకు ముగింపు పలికారు. ఇక, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు క్యాండీడెట్స్ భారీ ర్యాలీలతో ఆర్‌ఓల ఆఫీసులకు వెళ్లి నామినేషన్ వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి సీట్లు దక్కని వారు రెబల్స్‌గా కూడా పోటీ చేస్తున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 4355 మంది నామినేషన్లు వేశారు.
Also Read
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
అయితే, తెలంగాణలో మొన్నటి వరకు కేవలం 2,474 నామినేషన్లు దాఖలు కాగా.. నిన్న ( శుక్రవారం ) చివరిరోజు 2327 పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక, గురువారం రోజున ప్రముఖ నేతలు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు 15వ తేదీలోపు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు అని తెలిపింది.
Read Also: PF Interest Credit: ఈపీఎఫ్‌వో ఖాతాదారులు గుడ్ న్యూస్.. అందరి ఖాతాల్లో డబ్బులు జమ
ఇక, మరోవైపు బీ-ఫామ్ సబ్మిట్‌కు సైతం గడువు ముగిసింది. బీ-ఫామ్ సమర్పించని అభ్యర్థుల్ని స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. అలాగే నామినేషన్ సమయంలో వందకు పైగా అభ్యర్థులు ఇప్పటి వరకు అఫిడవిట్లు సమర్పించలేదు. దీంతో వాళ్లకు రిటర్నింగ్ ఆఫీసర్లు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈసారి నామినేషన్ల సంఖ్య 4355 నమోదు అయింది.
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!