Bhatti Vikramarka: ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. కానీ కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ఉందని తెలిపారు. రాష్ట్రం సంపదను పదికోక్కుల్లా దోచుకొని కాంగ్రెస్ పార్టీ ని విమర్శించడానికి సిగ్గుండాలని తెలిపారు. ప్రజలపక్షాన పోరాడేందుకే రాష్ట్రలో తిరిగానని అన్నారు.
ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. సంపద కలిగిన రాష్ట్ర కనుక 6 గ్యారంటీలు ప్రకటించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల కోసం అలోచన చేసే.. పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు తిరిగి అమలు చేస్తామన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎర్రుపాలెం మండలంలో నిధులు పారించామన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలవడం ఖాయమని తెలిపారు. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ తెలంగాణ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Minister Taneti Vanitha: వైసీపీ సింగిల్‌గానే పోటీచేస్తుంది.. మళ్లీ జగనే సీఎం..