సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది అని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జీ మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించే అధికారం ఎవ్వరికీ లేదు.. కాంగ్రెస్ పార్టీ అహంకారం ప్రదర్శించడం వల్ల ప్రజలు గద్దె దింపారు.. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.. సకల జనుల సమ్మె వల్లే తెలంగాణ వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. అధికారంలోకీ వచ్చిన వెంటనే చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తాం.. కాంగ్రెస్ పార్టీ చరిత్రను వక్రీకరిస్తుంది.. తెలంగాణ సోనియమ్మ బిక్ష కాదు అని మురళీధర్ రావు తెలిపారు.
Read Also: Indrakaran Reddy: మా నిర్మల్ అభివృద్ధి పట్టదా..? మోడీపై ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్
కుటుంబ రాజకీయాలను ప్రభుత్వంలోకీ కేసీఆర్ బహిరంగంగా తీసుకు వచ్చారు అని మురళీధర్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే.. తెలంగాణలో ప్రచారం చేస్తుంది ముగ్గురు గాంధీలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు.. కుటుంబ రాజకీయాలను అంతమొందించాలి.. సామాజిక తెలంగాణ ఇవ్వగలిగే ఏకైక పార్టీ బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ కలిసి నాటకం ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. సెక్యులరిజాన్ని కేసీఆర్ పగటిపూట కునీ చేశారు.. ఫహాడ్ షరీఫ్ లో కేవలం ముస్లింలకు మాత్రమే ఐటీ పార్క.. ఫహాడ్ షరీఫ్ లో హిందువులు లేరా? అని మురళీధర్ రావు ప్రశ్నించారు.
Read Also: Ponguleti Srinivas Reddy: ఈ ఎన్నికలు దోపిడి రాజ్యానికి ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ భద్రతకు చిల్లులు పొడుస్తుందని మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ సమాజం ఆలోచించి ఓటు వెయ్యాలి.. తెలంగాణ ప్రజలను అవమానించే హక్కు, అధికారం కాంగ్రెస్ కు లేదు.. మన ముఖ్యమంత్రులను అవమానించిన పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ అహంకారానికి ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారు.. గతంలో తెలంగాణ పోరాటాన్ని అణచివేసిన ఘనత కాంగ్రెస్ ది కాదా?.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది మేమే అని ఎలా అంటారు? అని ఆయన అడిగారు. క్వీన్ ఎలిజబెత్, క్లిమెంట్ ఎట్లీ పెట్టిన బిక్షనే భారత్ కు స్వాతంత్ర్యం అనగలమా?.. దశాబ్దాల పోరాటం, సకలజనుల పోరాట ఫలితం తెలంగాణ ఏర్పాటు.. జాతీయ నాయకులు వచ్చి పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడితే గట్టిగా బదులివ్వాల్సి ఉంటుంది.. చరిత్రను వక్రీకరించ వద్దు-తెలంగాణ సోనియా బిక్ష అసలే కాదు.. సకల జనుల పోరాటం, త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తోంది.. నిజాం ఇస్తే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని ఎంఐఎం అన్నట్టే వీళ్ల మాటలూ ఉన్నై.. కుటుంబాల గుత్తాధిపత్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మురళీధర్ రావు ఆరోపించారు.