Duddilla Sridhar Babu : నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే.
- మీ మొసలి కన్నీరు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది
- అప్పుడు ‘అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ’ గుర్తుకు రాలేదా...?
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన వారు నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగులు పడిన అష్టకష్టాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. “అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర మీది కాదా? నాడు నోటిఫికేషన్ల పేరుతో ఊరించి, పరీక్షల పేరుతో వేధించి, నిరుద్యోగుల యవ్వనాన్ని రోడ్ల పాలు చేసింది మీరు కాదా?” అని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ (TGPSSC) క్వశ్చన్ పేపర్లను బజారులో పప్పుబెల్లాల్లా అమ్ముకుంటుంటే కళ్లు అప్పగించి చూసిన పాపం బీఆర్‌ఎస్ నేతలదేనని ఆయన మండిపడ్డారు. పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థత గత ప్రభుత్వానిదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ భర్తీని ఒక ‘పవిత్ర కార్యం’లా చేపట్టిందని శ్రీధర్ బాబు తెలిపారు. “మేము అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కడా ఎలాంటి లీకేజీలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఇప్పటికే 70 వేల మందికి ప్రభుత్వోద్యోగాలు కల్పించాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చాం. త్వరలోనే గ్రూప్-3 నియామక పత్రాలు కూడా అందజేస్తాం” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికులు బడుగు, బలహీన వర్గాల వారే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
తాను శాసనమండలిలో అన్న మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “నిరుద్యోగులను తక్కువ చేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు. తెలంగాణ భవిష్యత్తు మీరే (యువత). కేవలం రాజకీయ లబ్ధి కోసం కొందరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. వారి ఊబిలో చిక్కి మోసపోకండి” అని నిరుద్యోగ సోదరులకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఉన్న సుమారు 25 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోందని మంత్రి వివరించారు. శాస్త్రీయబద్ధమైన ‘జాబ్ క్యాలెండర్’ ద్వారా నియామకాలు చేపడతాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్‌పై దృష్టి సారించి ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పిస్తాం. రాజకీయ నిరుద్యోగుల మాటలు నమ్మవద్దని, మీ కష్టం విలువ తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని, మీ భవిష్యత్తుకు తమదే భరోసా అని మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.
Home Tips: మీ ఇంట్లో బొద్దింకల బెడదా..? ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ ఇవి కనిపించవు..!
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!