జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రజా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తన వెంట ఉన్న వారు లింగాల గణపురం మండలం కేంద్రంలో జరిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరు కాకపోవడం వారిపై ఆయన పరోక్షంగా చురకలాంటించారు. వివారాల్లోకి వెళ్తే.. లింగాల గణపురం మండలంలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: Onam Special :ఆ దేవాలయంలో కోతులకు ప్రత్యేక విందు.. ఎందుకో తెలుసా?
గత కొద్ది సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అందరం కలిసి పని చేశామని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మళ్లీ మనం ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్లాలంటే కచ్చితంగా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలి.. ఏదో జరగబోయేది ఊహించుకోకండి, అనేక మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. మీరందరూ ప్రజాక్షేత్రంలో ఉండాలి తప్పకుండా మిమ్మల్ని అందరిని కాపాడడానికి నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను అని రాజయ్య పేర్కొన్నారు.
Read Also: Karnataka: గంధపు చెక్కల స్మగ్లర్ ఎన్‌కౌంటర్..
అయితే, గత కొన్ని రోజుల క్రితం ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ అశించిన తాటికొండ రాజయ్యకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఘనపూర్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడు. దీంతో అప్పటి నుంచి రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను కేసీఆర్ గీసిన గీత దాటను అని ప్రెస్ మీట్ పెట్టిమరి తేల్చి చెప్పారు.. కానీ తన వెనకే ఉండే ప్రజా ప్రతినిధులు దూరం అవుతుండటంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.