తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. గురువారం ఆరో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్టుగా సభ నడింది. సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్దం నడిచింది. కాగా సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తాము ఎవరికి భయపడేది లేదని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్బరుద్దీన్ ఎంత సేపు మాట్లాడినా తమకు ఇబ్బంది లేదంటూ ధీటుగా…
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపొద్దు.. వాళ్లు అన్ని వినాలని స్పీకర్ కు తెలియజేశారు. ఎంత గొడవ చేసినా బయటకు పంపొద్దు అధ్యక్ష అంటూ స్పీకర్ కు చెప్పారు. గవర్నర్ స్పీచ్ వింటుంటే సిగ్గు అనిపించింది అని కేటీఆర్ అన్నారు.. ఔను నువ్వు సిగ్గు పడాలని ముఖ్యమంత్రి విమర్శించారు. సిగ్గు పడే విషయాలు అన్ని చెప్తానన్నారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మావోల పేరుతో లేఖలు కనిపించాయి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ లేఖలు వైరల్ అవుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశాడు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్ ఆరోపించారు. అర్హులను కాదని, అనర్హులు, బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తున్నారని ఆయన అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవ్వరినీ గెలువనియ్యను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు దడ పుట్టింది.. చావు నోటి వరకు వెళ్లి తెలంగాణ తీసుకుని వచ్చనన్ని కేసీఆర్ చెబుతుంటారు.. అనాడు పండ్ల రసం డ్రింక్ త్రాగింది నిజం కదా.. ఉద్యమంలో యాక్టింగ్ చేశావు తప్ప మరేమీ లేదు అని పొంగులేటి అన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే ప్రజలను భయ బ్రాంతులను చేయడంలో నిష్ణాతులు అని ఆయన తెలిపారు.
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు.
Jangaon Crime: జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు రామకృష్ణయ్య దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు.
CM KCR: ఈ రోజు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్స్ ఛైర్మన్లకు పిలుపు అందింది.. ఈ సమావేశంలో జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు…