Off The Record: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అధికార బిఆర్ఎస్ లో లుకలుకలు పెరుగుతున్నాయని కేడర్ కోడై కూస్తోంది. BRS పార్టీ ఎమ్మెల్యేలకు…ఆ పార్టీ కార్పొరేటర్లకు మధ్య గ్యాప్ పూడ్చలేనంతగా వుంటోందన్న చర్చ సాగుతోంది. వివిధ రాజకీయ కారణాలతో ఎమ్మెల్యేలకు…కార్పొరేటర్ లకు మధ్య ఎడం చాంతాడంత పెరుగుతోందట. అప్పుడప్పుడు ఆ విబేధాలు బయట పడితే…మరి కొన్ని సందర్భాల్లో లోలోపల కత్తుల దూసుకుంటున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఫలితాలపై వీరి కోల్డ్ వార్…
Off The Record: ఏం మీ ఇంటి సొమ్ము అనుకున్నారా? సర్కార్ ఇచ్చే దళిత బంధు పథకానికి మూడు లక్షల కమీషన్ అడుతున్నారట…ఉంటారా ..పోతారా అంటూ ఆమధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల నాయకుల్ని ఉద్దేశించి అన్నారు సీఎం కేసీఆర్. ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నేతలకు సీఎం ఆ వార్నింగ్ ఇచ్చారన్నది అప్పట్లో టాక్. అయితే తాజాగా ప్రతినిధుల సదస్సులో కూడా… వసూళ్లు చేసిన ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గరుంది. పద్ధతి మార్చుకోండి అంటూ…
Off The Record: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు కేసీఅర్. వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ … ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈసారి సిట్టింగ్‌లలో టిక్కెట్‌లు దక్కేది ఎవరికి? నో చెప్పేది ఎవరికన్న చర్చ మొదలైంది. దీనికి తోడు గురువారం హైదరాబాద్‌లో జరిగిన BRS రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఎమ్మెల్యేల్లో సెగలు రేపుతున్నాయట. ఒక వైపు ఇప్పటికే పలు…
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు ప్రెస్ మీట్ పెట్టారు. జీవన్ రెడ్డి దళిత బంధు పథకంపై మతిబ్రమించి, సంస్కరహీనంగా మాట్లాడారు అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు జీవన్ రెడ్డికి మెదడు లేదు అంటూ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం అమలులో కొంతమంది ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.