CM Nitish Kumar comments on KCR Sabha: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు జాతీయ నాయకులు రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వేదికగా విపక్షాల భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత రోజ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఏం అక్కర లేదని.. నాకు ఒకే కల ఉందని , ప్రతిపక్షాల నాయకులు ఏకమై ముందుకు సాగాలని, అది దేశానికి మేలు చేస్తుందని’’ ఆయన…
Kanti velugu second phase: ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్ల జోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు.
నాలుగు వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను సీఎం కేసీఆర్ ధారాదత్తం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ నుంచి మీడియా దృష్టి మరల్చేందుకు తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది.