BRS Meeting: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్ గల్ మామిడి మార్కెట్ లో ఏర్పాటు చేసిన జగిత్యాల నియోజకవర్గ బీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్‌ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్ భారీ జనసమీకరణతో ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఈరోజు భారత రాష్ట్ర సమితి, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్‌లో సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు.