CM Nitish Kumar comments on KCR Sabha: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు జాతీయ నాయకులు రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వేదికగా విపక్షాల భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత రోజ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఏం అక్కర లేదని.. నాకు ఒకే కల ఉందని , ప్రతిపక్షాల నాయకులు ఏకమై ముందుకు సాగాలని, అది దేశానికి మేలు చేస్తుందని’’ ఆయన అన్నారు.
Read Also: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా..?
తెలంగాణ సీఎం ఆహ్వానం మేరకు బుధవారం జరిగిన ప్రతిపక్షాల బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, వామపక్ష నాయకుడు డీ. రాజా హాజరయ్యారు. ఈ సభ తరువాత నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కేసీఆర్ సభపై విలేకరులు నితీష్ కుమార్ ను ప్రశ్నించగా.. ఈ సభ గురించి నాకు తెలియదని, నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నానని, కేసీఆర్ సభకు ఆహ్వానం అందిన వారు తప్పకుండా వెళ్లి ఉంటారని ఆయన అన్నారు.
ఈ సభలో ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా నాయకులు విమర్శలు గుప్పించారు. మోదీకి ఇంకా 399 రోజలు సమయమే ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిచడంతో పాటు ప్రైవేటైజేషన్ అడ్డుకుంటామని అన్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ ప్రధాని పదవిపై ఆశలేదని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారని జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఇంటికి వెళ్తుందని సీఎం కేసీఆర్ నిన్న అన్నారు.