Harish Rao : జనగామ జిల్లా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడుతూ, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మోటార్లు పనిచేయలేదని, చెరువులు నింపుకోలేకపోవడంతో రైతుల పంటలు తీవ్ర నష్టానికి గురయ్యాయని ఆరోపించారు. “ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గ్రహం…