అకస్మాత్తుగా ఎక్కడైనా భూమి బద్దలైతే.. ఏమౌతుంది. అందరు భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా రోడ్లపై ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం వంటివి చూస్తుంటాం. కానీ ఈ ఘటన చూస్తుంటే సినిమాలలో కారు గాల్లోకి లేసే సీన్లు గుర్తుకువస్తుంది. రద్దీగా ఉండే రోడ్డుపైనే వాహనాలు ఆగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారి భూమి బద్దలైంది. దీంతో అక్కడున్న వాహనాలు గాల్లోకి ఎగిరాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు భయాందోళనలకు గురయ్యారు.
Jordan Restaurant: అబ్బో ఆ రెస్టారెంట్ లో తిన్నాక.. కాసేపు హాయిగా పడుకోవచ్చు..
ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. భూమి లోపల గ్యాస్ పైప్‌లైన్ అకస్మాత్తుగా పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఐతే ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. ఈ వీడియోను @BernieSpofforth అనే IDతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ ప్రమాదం గ్యాస్ లీక్ వల్ల జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
Priya Prakash Varrier: బీచ్లో బికినీతో రచ్చ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్
మరోవైపు ఈ వీడియోను ఇప్పటికి 2 లక్షలకు పైగా మంది చూశారు. అంతేకాకుండా వందలాది మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్యాస్ లీక్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరంటే, ‘వాతావరణ మార్పు’ ప్రభావం వల్లే జరిగిందని మరికొందరు చెబుతున్నారు.
SOUTH AFRICA – Johannesburg. Authorities deny this explosion lifting cars off the ground was a gas leak.
What was it then? 👀
— Bernie's Tweets (@BernieSpofforth) July 21, 2023