సెప్టెంబరు 9 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న G20 లీడర్స్ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకుల కలయికకు సాక్ష్యమివ్వనుంది. జీ20 సమ్మిట్‌కు హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి ప్రయత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Today Business Headlines 29-04-23: ఎల్ఐసీ చైర్మన్‌గా: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎల్ఐసీకి పూర్తి స్థాయి చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి నియమితులయ్యారు. ఈ సంస్థకు ప్రస్తుతం ఈయనే ఎండీగా మరియు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ మొహంతి ఈ పదవిలో 2025 జూన్ 7 వరకు.. అంటే.. ఆయనకు 62 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటారు.
ChatGPT: ప్రపంచ మీడియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ.. ఎవరూ.. చూడని ఒక కొత్త యాంకర్ తాజాగా తెర మీదికొచ్చారు. ఆమె పేరు.. చాట్‌జీపీటీ. అదేంటి?.. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్ కదా అనుకుంటున్నారా?. అది నిజమే. ఆ కృత్రిమ మేధతో రూపొందించిన పరికరమే ఇప్పుడు యాంకర్‌గా సరికొత్త అవతారమెత్తింది. అంతర్జాతీయ ప్రముఖులిద్దరిని అలవోకగా ఇంటర్వ్యూ చేసేసింది.
ఎట్టకేలకు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్‌లో అత్యధికంగా రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించడంతో ఆయన యూకే ప్రధాని అయ్యారు.
బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నికుంటారని ఆమె ప్రకటించడంతో తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆమె ఈ విషయాన్ని ప్రకటించడంతో అందరి చూపు తాజాగా ఎన్నికల్లో ఓటమి పాలైన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై పడింది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా బోరిస్ జాన్సన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో బోరిస్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్- బ్రిటన్ మధ్య వాణిజ్య, ప్రజా సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశం…
ఒకప్పుడు భారత దేశాన్ని దోచుకున్న ఆంగ్లేయులకు ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేలాడుతోంది. దీంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. 2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న…