వచ్చే ఏడాది జరగబోయే బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంవీఏ మిత్ర పక్షంతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని సూచనలు చేశారు.
అక్రమంగా నిర్మించిన స్టూడియోలపై ముంబై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన డజన్ల కొద్దీ ఫిల్మ్ స్టూడియోలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు ప్రవేశించాయి. వీటిని మహా వికాస్ అఘాడి ప్రభుత్వ రక్షణలో నిర్మించారని బిజెపి ఆరోపించింది.