Usha Lakshmi: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కొత్త ఉషాలక్ష్మి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వయసు 91 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన డాక్టర్ ఉషాలక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గైనకాలజిస్టుల్లో ఒకరు. ఆవిడ గైనకాలజీ ప్రొఫెసర్‌గా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో సుదీర్ఘకాలం సేవలందించారు. అయితే ఆమెకు 69 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఉషాలక్ష్మి ఆ వ్యాధికి ఎదిరించి ధైర్యంగా నిలబడ్డారు.
Ponguleti Srinivasa Reddy: అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి.. ప్రజా పాలనలో ఉన్నాం
ఉషాలక్ష్మి కుమారుడు డాక్టర్ రఘురామ్ 2007లో కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫాండేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పింక్ పవర్ రన్ పేరిట ఇటీవల నిర్వహించిన అవగాహన ర్యాలీలో డాక్టర్ ఉషాలక్ష్మిని సత్కరించారు. ఆమె మరణంతో ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ