జమ్మూకశ్మీర్ కాల్పులతో మర్మోగింది. కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. శనివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక సైనికుడు ప్రాణాలు వదిలాడు.
దేశ రాజధాని ఢిల్లీ లజ్‌పత్‌నగర్‌లోని కంటి ఆస్పత్రికిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐ7 చౌదరి ఐ సెంటర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.