తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మరోసారి డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫోటోస్ ఫ్రేమ్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్శిల్స్ చేసి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బేగంపేటలో ఇంటర్ నేషనల్ పార్శిల్స్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేయగా 14 కిలలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 5.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ డ్రగ్స్ పంపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.