విధి వక్రీకరించడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సీఐ అనంతలోకాలకు పయనమయ్యాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలోని త్రీటౌన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరరావు విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బయలు దేరారు. అయితే ఎండాడ వద్ద గల జాతీయ రహదారిపై 3.40 గంటలకు గుర్తుతెలియని వాహనం వచ్చి సీఐ ఉన్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐతో పాటు ఉన్న కానిస్టేబుల్ సంతోష్ కు…
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు కథ, మాటలు బీవీఎస్ రవి అందిస్తున్నారు. రా ఎంటర్ టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”సోషల్ సెటైరికల్‌గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ సుబ్బు వేదుల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.…
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 27న మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో గత 22 నెలలుగా ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు కేంద్రం నిర్ణయం రాకపోవడంతో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని…
ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీలో కురిసిన భారీ వర్షాలపై మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వరదల్లో 34 మంది మృతి చెందారని, 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. మృతి చెందిన…
అమరావతి రైతులు, ఏపీకి ఒకే రాజధానికి మద్దతిస్తున్న వారికి జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. Also Read : కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో మొదటి ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కోరడంతో దానిపై వైసీపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే రెండవ రోజు ఉద్రిక్తతల నడుమ సాగిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం నిర్వహించనుంది.…
మోసగాళ్లు రోజురోజుకు మితిమీరి పోతున్నారు. కొత్త కొత్త పంథాలతో అమాయకులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌కు చెందిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులకు ప్రభుత్వం కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నమ్మబలికాడు. దీంతో సదరు వ్యక్తి మాటలు నమ్మిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులు ముడుపులు ముట్టజెప్పారు. ఇంకేముంది.. ఆ ముడుపులు తీసుకు ఆ కేటుగాడు పరారయ్యాడు. దీంతో మోసపోయామని తెలిసిన జేసీబీ, ట్రాక్టర్ల యజమానులు మహబూబాబాద్…
మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఘటనతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించారని, ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ చంద్రబాబు శపథం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను రెండున్నర ఏళ్లుగా అనేక రకాలు దూషించారని కానీ ఈ రోజు నా సతీమణిని కూడా దూషించారంటూ మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై యావత్తు టీడీపీ, నందమూర అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నందమూరి కుటుంబ…
నేటి సమాజంలో కొందరు చిన్నచిన్న విషయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటు వారిని నమ్ముకున్న వారికి తీరని శోకంలో ముంచుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెట్పల్లి మండలం ఆత్మనగర్ కు చెందిన తల్లీకూతుళ్ల వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో నిన్న ఇంటినుంచి వెళ్లిపోయిన తల్లి వనజ (28), కుమార్తె శాన్వి (6) లు వరద కాలువ దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ రోజు ఉదయం ఆత్మనగర్ వద్ద…