హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 27 రోజులకే ఓ నవవధువు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాతబస్తీ కి చెందిన రషీద్, షఫియా ఫాతిమా (21) లకు 27 రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే ఏంజరిగిందో ఏమో తెలియదు గానీ.. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో రషీద్ ఇంట్లో ఫాతిమా మృతదేహం అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. ఈ మేరకు కేసు…
ఏపీలో రాజకీయాలు రోజురోజు వేడెక్కుతున్నాయి. ఈ రోజు ఉదయం చంద్రబాబు మీడియా ముందు మాట్లాడిన మాటలకు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రోజా చంద్రబాబును పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసింది మానవ తప్పిదం..జగన్ పై నుంచి నీళ్లు పోసాడా..? అని ప్రశ్నించారు. భార్యను అల్లరి చేసుకుంటున్న పచ్చి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అని…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి పండుగ మళ్లీ మొదలైంది. అదేంటి అనుకుంటున్నారా.. అవునండి మొన్నటి వరకు భారీ వర్షాలతో గంజాయి రవాణా ముఠాకు అడ్డంకి వచ్చిపడింది. ఇప్పుడు కొంచెం వరుణుడు విరామం తీసుకుందామని తెలుగు రాష్ట్రాలకు సెలవు ప్రకటించాడో లేదో.. మళ్లీ గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. అయితే వారు రెచ్చిపోతే మేము తగ్గేదేలే అంటున్నారు పోలీసులు. తాజాగా హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు…
హైదరాబాద్ కు చెందిన యువతి శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అభిలాష్‌రెడ్డి, మౌనిక భార్యభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అయితే వివాహం జరిగినప్పటి నుంచి భర్త అభిలాష్‌రెడ్డి భార్య మౌనికను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. దీంతో విసుగుచెందిన మౌనిక భర్త అభిలాష్‌పై రెండు నెలల క్రితం సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ మహిళ పోలీస్…
గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మేఘాలయ కాంగ్రెస్‌లో చీలికలు మొదలయ్యాయి. మేఘాలయలో మొత్తం 60 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా తన అనచరులు 12 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా టీఎంసీ పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఆయన…
విధి వక్రీకరించడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సీఐ అనంతలోకాలకు పయనమయ్యాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలోని త్రీటౌన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరరావు విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బయలు దేరారు. అయితే ఎండాడ వద్ద గల జాతీయ రహదారిపై 3.40 గంటలకు గుర్తుతెలియని వాహనం వచ్చి సీఐ ఉన్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐతో పాటు ఉన్న కానిస్టేబుల్ సంతోష్ కు…
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు కథ, మాటలు బీవీఎస్ రవి అందిస్తున్నారు. రా ఎంటర్ టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”సోషల్ సెటైరికల్‌గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ సుబ్బు వేదుల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.…
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 27న మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో గత 22 నెలలుగా ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు కేంద్రం నిర్ణయం రాకపోవడంతో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని…
ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీలో కురిసిన భారీ వర్షాలపై మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వరదల్లో 34 మంది మృతి చెందారని, 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. మృతి చెందిన…