టీడీపీ నేత కూన రవికుమార్‌ను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులను దుర్భషలాడారనే ఆరోపణతో కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా శాంతినగర్‌లోని తన అన్నయ్య ఇంట్లో కూన రవికుమార్ నిద్రిస్తున్నారు.
Also Read:10వ రోజు : కోటి దీపోత్సవంలో.. కోనేటి రాయుడి కల్యాణం..
ఆ సమయంలో పోలీసులు భయబ్రాంతులకు గురి చేసి, గది తలుపులు తొలగించి మరీ తన తమ్ముడిని అరెస్ట్ చేశారని కూన రవికుమార్ అన్నయ్య కూన వెంకట సత్యానారయణ ఆరోపించారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు. అరెస్ట్ చేసిన కూన రవికుమార్‌ను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.