రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా రక్కరి మరోసారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో 1,913 కొత్త కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 232 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి…
ఏపీపీఆర్సీపీపై సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారులు కమిటీ ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. గత పది పీఆర్సీల్లో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గలేదని, హెచ్ ఆర్ఏ పై అసంబద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు టౌన్ లో తప్ప ఎక్కడా 16 శాతం హెచ్ఆర్ఏ వర్తించదని, పెన్షనర్లకు సంబంధించి 70 ఏళ్లకు అదనపు…
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రామకుప్పం మండలం అరిమాను పెంట గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మ, చెల్లిలను రాజకీయంగా వాడుకొని వదిలేసాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పోలవరం 71 శాతం పూర్తి చేసామని, ఇవ్వాళే భారతి సిమెంట్ బస్తా పై 30 రూపాయలు పెంచారని ఆయన మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో జగన్ మూడు ఇళ్లు కూడా నిర్మించలేదని, సాక్షిలో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి నన్ను…
ప్రధాని మోడీ నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లగా అక్కడి రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మోడీ కాన్వాయ్కి అడ్డంగా సుమారు 15 నిమిషాల పాటు రైతులు నిరసన తెలపడంతో, మోడీ తిరిగి వెళ్లిపోయారు. అయితే దీనిపై పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సైటెర్లు వేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దులో రైతులు నిరసన తెలిపారన్నారు. కానీ ప్రధాని మోడీ వారి కోసం 15…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పంకు వచ్చే వారని, ఈరోజు గ్రామాలు తిరగాలని చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా కుప్పంలో చంద్రబాబు పర్యటించని గ్రామాలు ఉన్నాయని, సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మేము మా ఎమ్మెల్యేలు అన్ని గ్రామాలు తిరుగుతున్నామన్నారు. కేవలం…
నేడు టీడీపీ అధినేత కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయని ఆయన అన్నారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయని, కుప్పంలో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. వెయ్యి, రెండు వేలు పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని, కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే….మిమ్మల్ని అన్నట్లు కాదా..?…
పీఆర్సీపై ఏపీలో క్లారిటీ రావడంలేదు. దీంతో ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో భేటీ కావాలని ఆశించడంతో వారితో జగన్ ఈ రోజు భేటీ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ నిర్వహించిన భేటీ ముగిసింది. సమావేశంలో సీఎం జగన్ ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని వెల్లడించారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని, ప్రాక్టికల్‌గా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని లేఖలో వనమా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసులకు, న్యాయవ్యవస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. వనమా రాఘవను నియోజకవర్గానికి,…
కరోనా రక్కసి మరోసారి తెలంగాణాలో రెక్కలు చాస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో యావత్తు దేశంతో పాటు తెలంగాణవాసులూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా తెలంగాణలో వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. అయితే తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,052 కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో మరో 240 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా…
విజయవాడ పుస్తక ప్రియులను అలరించటానికి 32వ పుస్తక ప్రదర్శన విజయవాడలో జనవరి 1న ప్రారంభమైంది. బందరురోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జనవరి 1నుంచి 11 వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవం నిర్వహించనున్నారు. అయితే బుక్ ఫెయిర్ సందర్భంగా నేడు పుస్తక ప్రియులు పాదయాత్రి నిర్వహించారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ నుంచి స్వరాజ్ మైదానం వరకు ఈ పాదయాత్ర జరిగింది. అయితే ఈ పాదయాత్రను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ ప్రారంభించారు. అంతేకాకుండా…