“రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబరాలు వికారంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జ్యోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ లక్ష్యంగా పాలన సాగిస్తుందని, టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో దోచుకో దాచుకో అన్న చందంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమే దేశ అభివృద్ధి అని, బీజేపీ మాదిరిగా దేశాన్ని రెండుగా విభజించి పాలించడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని ఆయన విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ.. కన్నీళ్ల రాష్ట్రంగా తెలంగాణ మారిందని, రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే తేలేదని ఆమె అన్నారు. ఎందరో అమరుల త్యాగ ఫలం సోనియాగాంధీ కృషి వల్లనే తెలంగాణ వచ్చిందని, సూర్యాపేట కాంగ్రెస్ సభ్యత నమోదు దేశంలోని ఆదర్శంగా ఉందని, కాంగ్రెస్ విజయాన్ని మోడీ, కేసీఆర్ లు ఆపలేరన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లో ఉందని, జీవో 317 ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఆమె వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!