తెలంగాణలో అమ్మాయిలపై, మహిళలపై టీఆర్‌ఎస్ నేతలు ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి నిప్పులు చెరిగారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అకృత్యాలు, ఆగడాలు, అమానుష ఘటనలు జరుగుతున్నాయని, టీఆర్‌ఎస్ నేతలు లైసెన్స్డ్ గుండాలు గా వ్యవహరిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మాయిలు ఎలా కనిపిస్తున్నారు మీకు… భార్యలను తీసుకురమ్మని అంటున్న సిగ్గు శరం లేని నేతలు వీళ్లు అంటూ ఆమె ధ్వజమెత్తారు. వీళ్ళు పెట్టె బాధలు భరించలేక ప్రజలు కాల్చుకుని చనిపోతున్నారని, అఘాయిత్యాలకు పాల్పడిన వారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ని కూడా వదిలి పెట్టడం లేదు దుర్మార్గులు అంటూ ఆమె మండిపడ్డారు. బాల్క సుమన్ నువ్వు వాడుతున్న భాష ఏందిరా.. అదేనారా ని సంస్కారం.. సుమన్ నీ పద్ధతి మార్చుకో.. అంటూ ఆమె హితవు పలికారు.