హైదరాబాద్‌లో బుధవారం వేకువజామునే భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రంగంలోకి దిగని జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పాటు పలు చోట్ల ఈదురు గాలులతో వర్షం కురియడంతో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాకుండా పలు చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఓల్డ్ సిటీలో భారీ వర్షం కారణంగా కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది.